రూ. 15 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతున్నామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ అన్నారు. మంగళవారం గోదావరిఖని లక్ష్మీనగర్ లో సింగరేణి సంబంధించిన రూ. 15 కోట్ల నిధులతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను ప్రారంభించారు. షాపింగ్ కాంప్లెక్స్ డిజైన్ పూర్తి చేశామని.. ప్రజలు, వ్యాపారులు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాగూర్, ఆర్జీ- 1 జీఎం లలిత్ కుమార్ పాల్గొన్నారు.