
సర్పంచ్ ఎన్నికలు.. క్లీన్ స్వీప్ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం
TG: అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఈ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. ఈక్రమంలోనే అధిష్టానం కీలక ఆదేశాలు జారీ చేసిందని సమాచారం. ఎన్నికల్లో భాగంగా జడ్పీటీసీ నుంచి వార్డు మెంబర్ వరకు గెలిచేందుకు అవకాశం ఉన్న వారికే టికెట్ ఇవ్వాలని నిర్ణయించింది. అలానే ముందు నుంచి పార్టీ కోసం పని చేసిన వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.