సింగరేణి ఆస్తుల రక్షణకు ప్రత్యేక నిఘా: ఎస్ఎస్ఓ వీరారెడ్డి

67చూసినవారు
సింగరేణి ఆస్తుల రక్షణకు ప్రత్యేక నిఘా: ఎస్ఎస్ఓ వీరారెడ్డి
ఆర్జీ1 ఏరియా గోదావరిఖని 7బి కాలనీ లో అక్రమంగా నిల్వచేసిన సుమారు రెండు టన్నుల స్క్రాప్ ను ఎస్&పిసి సిబ్బంది గుర్తించి శుక్రవారం స్వాధీనం పరచుకున్నారు. స్క్రాప్ విలువ 45వేల వరకు ఉంటుందని సింగరేణి ఆస్తుల రక్షణకు ప్రత్యేక నిఘా పెట్టామని ఎస్ఎస్ఓ వీరారెడ్డి తెలిపారు. జూనియర్ ఇన్స్పెక్టర్లు చంద శ్రీనివాస్, అక్బర్ అలీ తో పాటు సంక రాజేష్, ఎం తిరుపతి, ఎన్. రాధాకృష్ణ, నర్సయ్య, మల్లికార్జున్ పాల్గోన్నారు.

సంబంధిత పోస్ట్