ప్రైవేట్ పాఠశాలల ఆగడాలను అరికట్టాలి: టివియువి

85చూసినవారు
ప్రైవేట్ పాఠశాలల ఆగడాలను అరికట్టాలి: టివియువి
జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు చేస్తున్న ఆగడాలపై సోమవారం పెద్దపల్లి జిల్లా విద్యాశాఖ కార్యాలయ సూపరిండెంట్ కి తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర కార్యదర్శి చిప్పకుర్తి శ్రీనివాస్, జిల్లా నాయకులు బి రమేష్ లు మాట్లాడుతూ. ప్రైవేట్, కార్పొరేటు పాఠశాలలు తమ దోపిడీకి తెరలేపాయని, విద్యాశాఖ నిబంధనలు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్