త్రియంబకేశ్వర్ సేవలు భేష్.!

50చూసినవారు
త్రియంబకేశ్వర్ సేవలు భేష్.!
పదవీ విరమణ పొందుతున్న డిప్యూటీ కమిషనర్ ఆర్ త్రియంబకేశ్వర్ రావు నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ పర్యవేక్షణకు అందించిన సేవలు అత్యుత్తమమని రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ గా రామగుండం నగరంలో విధులు నిర్వహించి పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా శనివారం ఆయనను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. కార్పొరేటర్లు, అధికారులు, పాల్గోన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్