యువత స్వామి వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా క్రీడలు, యువజన సర్వీసుల శాఖ అధికారి సురేష్ అన్నారు. పెద్దపల్లి కలెక్టరేట్ లో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం స్వామి వివేకానంద 162వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈనెల 7న హైదారాబాద్ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి యూత్ ఫెస్టివల్ లో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో జాతీయ అవార్డు గ్రహీత అంజివర్మ పాల్గొన్నారు.