
దుబాయ్లో తెలంగాణ వాసి హత్య.. స్పందించిన బండి సంజయ్
పాకిస్థాని చేతిలో దుబాయ్లో పనిచేస్తున్న ప్రేమ్ సాగర్ అనే వ్యక్తి దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. తాజాగా హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఘటనపై ఆరా తీశారు. ప్రేమ్ సాగర్తో పాటు హత్యకు గురైన శ్రీనివాస్ మృతదేహాలను తొందరగా స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే విదేశాంగ శాఖ కార్యాలయ అధికారులు సైతం దుబాయ్ అధికారులతో మాట్లాడారు.