ఖిలా వనపర్తి ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం తరపున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం ధర్మారం మండలం ఖిలవనపర్తి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని దర్శించుకుని నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని నూతనంగా ఎన్నికైన కమిటీ చైర్మన్, సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదని తెలిపారు.