సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఎనగల్ గ్రామంలో ఆదివారం శేషవ్వ (46) అనే మహిళ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన తెలుసుకుని పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఎస్సై శ్రీకాంత్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి. మృతురాలికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.