రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మహంకాళి అమ్మవారి ఆషాడ మాసం బోనాల వేడుకలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఆర్యవైశ్యులతో పాటు విశ్వబ్రాహ్మణులు, పద్మశాలీల మహిళలు బోనాలు ఎత్తుకొని ప్రధాన వీధుల గుండా డప్పుచప్పులతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.