చంద్రంపేట: భూ వివాదంలో వ్యక్తి పై కత్తితో దాడి

71చూసినవారు
సిరిసిల్ల పట్టణంలోని చంద్రంపేటకు చెందిన కొలకాని శ్రీనివాస్, కొలకాని పర్శరాముల మధ్య 15 ఏళ్లుగా భూముల వివాదం కొనసాగుతోంది. పెద్దమనుషుల సమక్షంలో స్థలాలు పంపిణీ చేసినప్పటికీ, పర్శరాములు ఉన్న భూమిపై శ్రీనివాస్ ఇంటి నిర్మాణం కోసం ముగ్గుపోయడంతో శనివారం తీవ్ర గొడవ జరిగింది. దాడిలో శ్రీనివాస్ పర్శరాములపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్