లిఫ్ట్ ప్రమాదంలో కమాండెంట్ గంగారాం మృతి

79చూసినవారు
లిఫ్ట్ ప్రమాదంలో కమాండెంట్ గంగారాం మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లాలో లిఫ్ట్ ప్రమాదంలో TGSP 17వ బెటాలియన్ అదనపు కమాండెంట్ గంగారాం(55) మృతి చెందాడు. ఆయన లిఫ్ట్‌లోకి వెళ్లే క్రమంలో డోర్ ఓపెన్ చేసి అందులో అడుగు పెట్టగానే ఒక్కసారిగా కింద పడిపోయారు. తీవ్రగాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా అక్కడ మరణించారు. లిఫ్ట్ వచ్చిందనుకొని డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లడంతో ప్రమాదం జరిగినట్లు తెలిసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్