
చిత్తూరులో టెన్షన్.. టెన్షన్
AP: చిత్తూరు టౌన్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. గాంధీ రోడ్డులోని ఓ భవనంలో చొరబడిన దొంగల ముఠా తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపింది. ఇంటి యజమాని అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఐదుగురు దొంగలను అదుపులోకి తీసుకున్నారు. మరో ఐదుగురు భవనంలో ఉన్నట్లు సమాచారం. ఇంటి పక్కన ఉన్న ఐడీబీఐ బ్యాంకులో చోరీ కోసం దొంగల ముఠా వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.