గుండెపోటుతో గల్ఫ్ కార్మికుడి మృతి

52చూసినవారు
గుండెపోటుతో గల్ఫ్ కార్మికుడి మృతి
గుండెపోటుతో ఓ గల్ఫ్ కార్మికుడు మృతిచెందిన ఘటన తంగళ్లపల్లి మండలంలోని మల్లాపూర్లో జరిగింది. స్థానికుల ప్రకారం.. గ్రామానికి చెందిన రాజేశ్ ఉపాధి నిమిత్తం గత పదేళ్లుగా గల్ఫ్ లో ఉంటున్నాడు. 6 నెలల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో మంగళవారం హఠాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందాడు. మృతుడికి భార్య, కొడుకు ఉన్నారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్