సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక యాప్ ద్వారా కొనసాగుతుంది. అయితే 2 రోజుల నుంచి ఈ యాప్ సరిగా పనిచేయడం లేదు. దరఖాస్తుదారులకు సొంత స్థలం ఉంటే ఆ స్థలంలో లబ్ధిదారులను నిలబెట్టి ఫోటో తీసి యాప్ లో లోడ్ చేసే ప్రక్రియలో ఎక్కువ సమయం తీసుకుంటుంది. యాప్ లో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నవి. అందువల్లే సర్వర్ డౌన్ అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.