ముస్తాబాద్ మండల ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన చిందం గణేశ్ను పద్మశాలీ సేవా సంఘం మండల అధ్యక్షుడు గూడూరి భరత్ ఆధ్వర్యంలో ఆదివారం శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తడక బాలకిషన్, తుమ్మ రాజేందర్, చిలివేరి ప్రశాంత్, ప్రభాకర్ దేవానందం, అభిషేక్, భూమేశ్, తదితరులు పాల్గొన్నారు.