ముస్తాబాద్ మండలం తేర్లమద్ది గ్రామానికి చెందిన రాజయ్య శనివారం ఇల్లు శుభ్రం చేస్తుండగా విద్యుత్ సర్వీస్ వీరు ఇంటి వరండాలో నీటిలో పడింది. దాన్ని పక్కకు తొలగిస్తున్న క్రమంలో కరెంట్ షాక్ తగిలింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇన్ ఛార్జ్ హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.