ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలు పురోగతిపై మంగళవారం సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ట్రక్ షీట్స్ ప్రకారం సంబంధిత రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. ఎక్కడైనా రైస్ మిల్లర్లు ధాన్యం దించుకొని పక్షంలో ఇంటర్మీడియట్ గోదాములకు తరలించాలన్నారు.