రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో శనివారం రాత్రి నేతన్నల ఆధ్వర్యంలో ఘనంగా మార్కండేయ జయంతి ఉత్సవాల నిర్వహించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో నేతన్నలు, పట్టణ ప్రముఖులు హాజరు కావడంతో సందడి వాతావరణం నెలకొంది. సిరిసిల్ల పట్టణ పురవీధుల గుండా మార్కండేయ స్వామివారిని ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా నృత్యాలు పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.