ప్రజా సమస్యలపై నిరంతరం ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని ఫార్ములా-ఈ రేస్ కేసులో ప్రభుత్వం కక్షతోనే మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇచ్చిందని బీఆర్‌ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య విమర్శించారు. పాలన చేతగాని రేవంత్‌రెడ్డిని ప్రజా క్షేత్రంలోకి వెళ్తే ఎక్కడికక్కడ నిలదీస్తుండడంతో ప్రజల దృష్టిని మరల్చేందుకే డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపిండని శనివారం ఆరోపించారు.