సిరిసిల్ల: కుమార్తె వైద్యానికి అప్పులు.. తీర్చలేక తండ్రి ఆత్మహత్య

8చూసినవారు
సిరిసిల్ల: కుమార్తె వైద్యానికి అప్పులు.. తీర్చలేక తండ్రి ఆత్మహత్య
సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వన్పల్లికి చెందిన కుమ్మరి పోచయ్య (65) ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. అతని కుమార్తె తిరుమల (25) చిన్నతనం నుండి అనారోగ్యంతో బాధపడటంతో వైద్య ఖర్చులకు లక్షల్లో అప్పులు చేశాడు. అప్పులు తీర్చలేక తీవ్ర మనోవేదనతో తెల్లవారుజామున చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్