
స్పేస్ఎక్స్కు చెందిన డ్రాగన్ వ్యోమనౌక ప్రయోగం వాయిదా
స్పేస్ఎక్స్కు చెందిన డ్రాగన్ వ్యోమనౌక ప్రయోగం వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం జూన్ 10 ఉదయం 8.22 గంటలకు నాసా కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి దూసుకెళ్లాల్సి ఉండగా వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో వ్యోమనౌకను తాత్కాలికంగా నిలిపివేశారని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. మళ్లీ జూన్ 11న ప్రయోగాన్ని చేపట్టనున్నారు. ఇది ఆక్సియమ్ మిషన్-4లో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక వ్యోమ మిషన్ కావడం విశేషం.