తండ్రిని కుమారుడు చంపిన ఘటన ఎల్లారెడ్డిపేటలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన కుంచం కనకయ్యను కుమారుడు పర్ష రాములు మెడపై కట్టెతో బలంగా కొట్టడంతో మృతి చెందాడని స్థానికులు తెలిపారు. కొద్దిరోజులుగా మద్యానికి బానిసైన పర్ష రాములను తండ్రి కనకయ్య మందలించడంతో కోపోదృక్తుడైన కుమారుడు తండ్రి కొట్టడంతో మరణించాడని స్థానికులు వివరించారు.