కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ పాఠశాల (CBSE) విద్యార్థులు మంగళవారం రోజున ప్రకటించిన పదవ తరగతి ఫలితాలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి పాఠశాల కీర్తిని ఇనుమడింపజేశారు. ఈ పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు అర్హాన్ (486/500), నేహశ్రీ (477/500) మరియు హన్సిక్ (475/500) మార్కులతో మొదటి మూడు స్థానాలలో నిలిచారు, 400 పై మార్కులతో 26 మంధి విధ్యార్థులు, తెలుగులో యమున 100/100 మార్కులు మరియు అర్హాన్ సైన్స్ లో 100/100 మార్కులతో అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా సెయింట్ జార్జ్-CBSE మరియు పారడైజ్ విద్యాసంస్థల చైర్మన్ డా.పి.ఫాతిమారెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను మరియు 100% ఫలితాలు సాధించినందుకు అధ్యాపక బృందం , ప్రిన్సిపాల్ ను అభినందించారు.contact number :-8977922604