విలాసాగర్ గ్రామ చెరువులో వింత జంతువులు.. వీడియో వైరల్

66చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో శుక్రవారం వింత జీవులు కలకలం రేపాయి. బోయినిపల్లి (M) విలాసాగర్ గ్రామ చెరువులో ఈ వింత జంతువులను స్థానికులు గుర్తించారు. గ్రామ చెరువు కట్ట మైసమ్మ వద్ద స్థానికుడు హరీష్ అనే వ్యక్తి చెరువు కట్ట వద్ద 10 నుంచి 15 వరకు ఉన్న వింత జీవులను చెరువులో చూశారు . వెంటనే గ్రామస్తులకు ఈ విషయాన్ని తెలిజేశాడు. కొంత మంది వాటిని నీటి కుక్కలుగా అనుమానం వ్యక్తం చేశారు. గ్రామంలో ఇలాంటి వింత జీవులను మునుపెన్నడూ చూడలేదని గ్రామస్తులు అంటున్నారు.

సంబంధిత పోస్ట్