విద్యార్థులు పోటీ పరీక్షల పట్ల అవగాహన పెంచుకోవాలి : కలెక్టర్ పమేలా సత్పతి

52చూసినవారు
విద్యార్థులు పోటీ పరీక్షల పట్ల అవగాహన పెంచుకోవాలి : కలెక్టర్ పమేలా సత్పతి
విద్యార్థులకు పోటీ పరీక్షల పట్ల అవగాహన ఉండాలని మరియు వాటిలో పాల్గొనేందుకు ఆసక్తి ప్రదర్శించాలని కరీంనగర్ కలెక్టర్ పమేల సత్పతి అన్నారు.జిల్లా విద్యాశాఖ అధికారి, వి.ఎస్ జనార్దన్ రావు, అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి తో కలిసి స్థానిక కొత్తపల్లి లోని అల్ఫోర్స్ ఇ- టెక్నో పాఠశాలలో వేడుకగా నిర్వహించినటువంటి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఒలంపియాడ్ శిక్షణ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలన చేసి సరస్వతి మాత విగ్రహానికి పూలమాలవేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు పోటీ ప్రపంచంలో వివిధ పోటీ పరీక్షల పట్ల చక్కటి అవగాహన ఉండాలని మరియు వాటిని విశ్లేషించి వాటిలోని విషయాలను సమగ్రంగా ఆలోచించి పోటీ పరీక్షల్లో పాల్గొనాలని మరియు విజయం సాధించాలని చెప్పారు. భారతదేశ వివిధ పోటీ పరీక్షల నిర్వహణకు మరియు కేంద్రాలకు నిలయమని చాలామంది విద్యావంతులు ఉన్నారని, మేధావులు పుట్టినటువంటి ప్రదేశం భారతదేశం అని గర్వంగా చెప్పచ్చన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సౌకర్యార్థమై నేడు అల్ఫోర్స్ విద్యాసంస్థల వారి ప్రత్యేక సౌజన్యంతో విద్యార్థులకు సైన్స్ మరియు మ్యాథ్ లో రాణించడానికి మరియు ఖ్యాతి గడించడానికి ప్రముఖ పోటీ పరీక్షల సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని ఫౌండేషన్ ఇస్తున్నామని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని అంశాలలో పట్టు సాధించి విజయం వైపు అడుగులు వేయాలని కోరారు. ఈ ఫౌండేషన్ ను బయట పొందాలనుకున్న వారు డబ్బులు వెచ్చించాల్సిందేనని మరియు నేడు వారు ఎటువంటి ఖర్చు లేకుండా ఉచితంగా కోచింగ్ అందించడం చాలా గొప్ప విషయమని మరియు ఆదర్శనీయమని కొనియాడుతూ వారి విద్యా సంస్థల్లో క్రమశిక్షణ మరియు నాణ్యత పరంగా చాలా మంచి పేరు ఉందని చెప్పారు. జనార్ధన్ రావు మాట్లాడుతూ విద్యార్థులకు గణిత మరియు సైన్స్ అంశాలలో పట్టు సాధింపజేయడానికి మరియు భవిష్యత్తులో వారు రాయబడేటువంటి పోటీ పరీక్షలను మరింత సులభతరం చేయడానికి ప్రాథమికంగా నేడు వారికి ఫౌండేషన్ క్లాసులు ప్రారంభించడం చాలా హర్షించదగ్గ విషయమని చెప్పారు. ఇట్టి కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజ హితానికై నిర్విరామంగా కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్ కి మరియు విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ చక్కటి ప్రణాళికలతో విద్యార్థులందరూ విజయాన్ని సాధించాలని చెప్పారు.

విద్యా సంస్థల అధినేత డా.వి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు అత్యున్నత శిఖరాలను అధిరోహించే విధంగా మరియు కోర్సులో నైపుణ్యం పొందిన ఉపాధ్యాయులుచే అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తూ విద్యార్థులకు కోచింగ్ అందించడం జరుగుతుందని మరియు జిల్లా యంత్రాంగం సమన్వయంతో విద్యార్థులకు అన్ని కోణాలలో విషయాలను నేర్పించడం జరుగుతుందని చెప్పారు. జిల్లా కలెక్టర్ అనేక కార్యక్రమాలను రూపొందిస్తున్నారని మరియు వారు తీసుకునే చొరవ చాలా అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కోచింగ్ సమన్వయకర్తలు అశోక్ రెడ్డి, నాణ్యత సమన్వయకర్త, జైపాల్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you