24 గంటల్లో 19 ఆపరేషన్లు వేములవాడ ప్రాంతీయ ఆస్పత్రిలో

56చూసినవారు
గత 24 గంటలలో వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ప్రాంతీయ ఆసుపత్రిలో వివిధ రకాల 19 ఆపరేషన్లు జరిగాయి. ఇందులో 11 మంది గర్భిణీలు డెలివరీలు అయ్యారు. ఇందులో ఆరుగురు ఆపరేషన్లు ఐదుగురు సాధారణ కాన్పులు జరగడం అయినది. ఇద్దరికీ గర్భసంచికి సంబంధించిన వ్యాధుల వల్ల గర్భసంచినీ తొలగించడం జరిగినది. ముగ్గురికి కంటి ఆపరేషన్లు, ఇంకో నలుగురికి జనరల్ సర్జరీలు చేయడం జరిగినది. వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రిలో అన్ని రకాల స్పెషలిస్టుల సేవలు అందుబాటులో ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు ఇట్టి అవకాశాలను సద్వినియోగ పర్చుకోవాలని ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ పెంచలయ్య తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్