టీమిండియా కు శుభాకాంక్షలు: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

72చూసినవారు
టీమిండియా కు శుభాకాంక్షలు: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
టి20 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ ఘన విజయం పట్ల ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. 17 ఏళ్ల నిరీక్షణ తరువాత టీ -20 వరల్డ్ కప్ లో భారత్ విజయం పట్ల తనకు సంతోషాన్ని కలిగించిందని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్ బృందానికి అభినందనలు తెలిపారు. భారత్ టి 20 ప్రపంచ కప్ గెలవడం పట్ల దేశ ప్రజలకు, క్రికెట్ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్