దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఈవో వినోద్ రెడ్డి, అర్చకులు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం అద్దాల మండపంలో అర్చకులు వేద పండితులు ఆశీర్వదించగా స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లడ్డూ ప్రసాదం అందజేశారు.