చందుర్తి: పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య

73చూసినవారు
చందుర్తి: పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చందుర్తి మండలంలో గల నర్సింగాపూర్ గ్రామంలో వివాహిత మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. నర్సింగాపూర్ కు చెందిన ఆరేపల్లి అపర్ణకు, ఆమె భర్తకు మధ్య రెండు సంవత్సరాల నుండి కుటుంబ కలహాలు చోటు చేసుకున్నాయని దీనితో పాటు వరకట్నపు వేధింపులు అధికమవ్వడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె తల్లి శంకరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్