ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయిన లబ్ధిదారులు త్వరితగతిన పనులు పూర్తి చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. రుద్రంగి మండలంలోని గైదిగుట్ట తండాలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల పనులను కలెక్టర్ బుధవారం పరిశీలించారు. ఈ గ్రామం పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక కాగా, 44 ఇండ్లు మంజూరయ్యాయి. 23 ఇండ్లు వివిధ దశల్లో ఉన్నాయి. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.