ప్రభుత్వ ఇసుక రీచ్ ల నుంచి అన్ని పత్రాలను వెంట పెట్టుకొని ఇసుకను తరలించాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. వేములవాడలో ఇసుక తరలిస్తున్న ఓ ట్రాక్టర్ ను ఆపి వే బిల్లు, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర పత్రాలను తనిఖీ చేశారు. అక్రమంగా ఇసుక తరలించే వాహనాలు సీజ్ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఇసుక తరలించాలని కలెక్టర్ సూచించారు. వారి వెంట ఎమ్మార్వో మహేష్, వేములవాడ కమిషనర్ అన్వేష్ ఉన్నారు.