వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారి ఆలయానికి ఆదివారం సెలవు దినం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టు స్వామి వారిని దర్శించుకున్న తర్వాత కూడా భక్తులు రావడంతో వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో కనువిందు చేస్తుంది. అర్చక స్వాములు వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు.