ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రేపటి పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం ఉదయం 10 గంటలకు పట్టణంలో తూర్పు వాడ మున్నూరు కాపు సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించే పోచమ్మ బోనాల మహోత్సవంలో పాల్గొంటారు. బాలానగర్ కమాన్ వద్ద మున్సిపల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించే వన మహోత్సవ కార్యక్రమం, చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో నూతన పెట్రోల్ బంక్ ను ప్రారంభిస్తారు. వేములవాడలో పలు బోనాల వేడుకల్లో పాల్గొంటారు.