చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

81చూసినవారు
చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర గార్డెన్లో వేములవాడ పట్టణ అర్బన్ రూరల్ మండలాలకు సంబంధించిన 208 కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు శనివారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పంపిణీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే ఆది శ్రీనివాసలకు లబ్ధిదారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మాధవితో పాటు పలువురు కౌన్సిలర్లు, రూరల్, అర్బన్ మండల నాయకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్