రైతుల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఏఎంసీ చైర్మన్ రోండి రాజు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని లింగంపల్లి, బొల్లారం గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ ఛైర్మెన్ రొండి రాజు ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభించారు. ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, ధాన్య కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చెయ్యటం జరిగిందన్నారు.