వేములవాడ పట్టణంలో గురువారం వేకువజామున భారీ వర్షం కురుస్తుంది. దీంతో వాహనాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రోడ్లపైకి వర్షం నీరు చేరింది. వేకువ జామునే భారీ వర్షం కురవడంతో రైతు మార్కెట్లో రైతులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మార్నింగ్ వాకింగ్ కు వచ్చిన వాకర్స్ నిలిచిపోయారు. గత రెండు మూడు రోజులుగా చూసుకుంటే వాతావరణంలో మార్పులు ఒక్కసారిగా చోటు చేసుకుంటున్నాయి.