రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో శుక్రవారం ఘనంగా హోలీ పండుగ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మీడియాతో పట్టణానికి చెందిన యువకుడు విశాల్ కుమార్ మాట్లాడుతూ. ప్రజలందరూ చిన్న పెద్ద తేడా లేకుండా హోలీ పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తీరొక్క రంగులతో ఒకరిపై ఒకరు చల్లుకొని వేడుకలు చేసుకున్నారు. ఎవరి ముఖం చూసిన రంగులతోనే దర్శనమిస్తుంది.