వేములవాడలో హుండీ ఆదాయం లెక్కింపు

55చూసినవారు
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. లెక్కింపు కార్యక్రమాన్ని ఈవో వినోద్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. సిసి కెమెరాలు పోలీసు ఎస్పీఎఫ్ సిబ్బంది పటిష్ట భద్రత నడుమ హుండీ లెక్కింపు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి 15 నుంచి 20 రోజుల వ్యవధిలో హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమాన్ని చేస్తున్నట్లు ఈవో వినోద్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్