జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి బుధవారం 1, 23, 761 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. టికెట్ల ద్వారా 67, 898 రూపాయలు, ప్రసాదాల ద్వారా 44, 770 రూపాయలు, అన్నదానం కోసం 11, 093 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి సంకటాల శ్రీనివాస్ ఒక ప్రకటనలో వెల్లడించారు.