రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన పొలాస (వంటల) రాజేశం సోమవారం సాయంత్రం హార్ట్ స్ట్రోక్ తో చనిపోయాడు. దీంతో వారి కుటుంబాన్ని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాజేశం మృతి చెందడం బాధాకరమన్నారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.