రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో సోమవారం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇందిరమ్మ ఇల్లు భూమి పూజ చేశారు. స్వంత ఇంటి కోసం పదేళ్లు కండ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన వారి కల నేడూ నెరవేరుతుందని ఎమ్మెల్యే అన్నారు. గతంలో పేదలకు ఇందిరమ్మనే ఇల్లు ఇచ్చిందని, లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డి చల్లగా ఉండాలని కోరుకుంటున్నారు. లబ్ధిదారులు ఎమ్మెల్యే, సీఎం లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.