అంగన్వాడి కేంద్రాల్లో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం

81చూసినవారు
అంగన్వాడి కేంద్రాల్లో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం
రాజన్న సిరిసిల్ల జిల్లా నాగయ్యపల్లి, పోశెట్టిపల్లి గ్రామాల్లోని అంగన్వాడి కేంద్రాలలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ నిర్మల దేవి ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో రెండున్నర సంవత్సరాలు నిండిన చిన్నారులకు అంగన్వాడీ కేంద్రంలో కొత్తగా నమోదు చేసుకుని వారికీ అక్షరాభ్యాసం చేయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు లక్ష్మీబాయి, సరిత, విద్యార్థులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్