వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందు ఆలయానికి రావడంతో అధికారులు అర్చకులు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం అర్చక స్వాములు వేద పండితులు వారిని ఆశీర్వదించారు. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అందరికీ స్వామివారి కృప ఉండాలన్నారు