
ప్రపంచ కుబేరుల జాబితా.. 2వ స్థానాన్ని కోల్పోయిన జెఫ్ బెజోస్
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజెస్బెజోస్ ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానాన్ని కోల్పోయారు. ఆ స్థానాన్ని ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ సొంతం చేసుకున్నారు. 243 బిలియన్ డాలర్ల సంపదతో ఎల్లిసన్ రెండో ధనవంతుడిగా నిలిచారు. ఈ విషయాన్ని ఫోర్బ్స్ వరల్డ్ బిలియనీర్స్ జాబితాలో తెలిపింది. ఈ జాబితా ప్రకారం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 407 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.