వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలోని శ్రీ ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమం అనంతరం అర్చకులు వేద పండితులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారి కృపా కరుణ కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మీడియాకు తెలిపారు.