వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ కు ఆలయ కమిటి సభ్యులు, అర్చకులు పూర్ణకుంభతో స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించి ప్రత్యెక పూజలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ మన ప్రాంతంలో ఎంతో పురాతన ఆలయం ఉండటం మన ప్రాంత ప్రజల అదృష్టం అన్నారు.