వేములవాడ పట్టణ శివారులోని రెడ్డి సంఘ భవనం నందు రూమ్ కిరాయి తీసుకొని పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు ఎస్ఐ రమేష్ తన సిబ్బంది దాడి చేసి రాజు, కిషోర్, సుధాకర్, నాగరాజు, సంతోష్ రెడ్డి అను నిందితులను పట్టుకొని రూ. 12,200 నగదు, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామని ఎస్ఐ గురువారం తెలిపారు. పట్టణ సీఐ వీరప్రసాద్, ఎస్సై రమేష్, సిబ్బంది గోపాల్ మరియు సమీయుద్దీన్ లను ఎస్పీ అభినందించారు.