సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో కార్యక్రమాలు: కలెక్టర్

50చూసినవారు
సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో కార్యక్రమాలు: కలెక్టర్
ప్రజలకు ఉన్న భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆర్వోఆర్ చట్టం భూ భారతి పై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న కార్యక్రమాలను విజయవంతం చేయాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సదస్సుల షెడ్యూల్ విడుదల చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 17 నుంచి 29వ తేదీ దాకా జిల్లాలోని మండల స్థాయిలో భూ భారతి చట్టం పై ప్రజలు, రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్