రాజన్న హుండీ ఆదాయం వివరాలు

80చూసినవారు
వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి 15 రోజుల హుండీ ఆదాయం వివరాలు ఇలా ఉన్నాయి. రూ. 86 లక్షల 85 వేల 3వందల ఏడు రూపాయలు. (86, 85, 307 రూపాయలు)వచ్చినట్లు ఈవో వినోద్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బంగారం 83 గ్రాములు, వెండి 05 కిలోల 500 గ్రాములు వచ్చినట్లు తెలిపారు. హుండీ లెక్కింపును ఈవో వినోద్ పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఏసీ కార్యాలయ పరిశీలకులు సత్యనారాయణ, ఏఈఓలు, పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్